Posted on 2025-09-02 21:22:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత అని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాలలో సజీవంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, బాసర ఐఐఐటి, సాగునీటి పథకాలు, గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 90 వేల ఎకరాలకు నీరు అందించడం వైఎస్సార్ కృషి ఫలితమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన నిలిచి, పంట రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ ధర్మగౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, యూత్ నాయకుడు ఉమ్మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్లు నరేందర్, రాజలింగం, గంగారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రన్న, వాసు బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >