Posted on 2025-09-02 21:20:46
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల చేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని,ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి అని, అందులో భాగంగా విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీంను తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా పేద కుటుంబాలకు వైద్యం అందాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి వైద్యానికి అయ్యే ఖర్చు సులభతరం చేయడం జరిగిందని, అదేవిధంగా 108, 102,104 అంబులెన్సులను తీసుకువచ్చి క్షతగాత్రులను నిమిషాలలో ఆసుపత్రికి తీసుకువచ్చే రవాణా వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయుడు అని, రైతుల కొరకు ఉచిత 24 గంటల కరెంటును అందించిన మహనీయుడని, రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కేశ వేణు అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన ఆలోచిస్తూ పేద ప్రజల అభివృద్ధి తన సంతోషంగా భావించి ఎల్లప్పుడూ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి అని ప్రతిపక్షాలు అని తేడా లేకుండా అందరిని సమానంగా చూసిన వ్యక్తి అని, తాను మృతిచెందిన తర్వాత రాష్ట్రం మొత్తం కన్నీటి మయం అయ్యిందని, ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి లేరు అని మాటను జీర్ణించుకోలేకపోయారని, ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, జండా గుడి చైర్మన్ ప్రమోద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, బంటు బలరాం, కొండపాక రాజేష్, కు, రమేష్, పుప్పాల విజయ, బింగి శుభం తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >