Posted on 2023-12-23 20:58:37
ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
ప్రభుత్వ ఆలోచనలను అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలి
వారం రోజులోనే రెండు గ్యారంటీలు అమలు చేశాం
100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది
డైలీ భారత్, సిరిసిల్ల :క్షేత్ర సమస్యల పై అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పనిచేయాలని కోరారు. శనివారం సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, సెస్, రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. సభ్యులు పలు అంశాలను లేవనెత్తగా వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత తొలిసారి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశ అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా జిల్లాలోని ఏఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. గతంలో తాను చందుర్తి జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేసిన సమయంలో అనేక క్షేత్రస్థాయి సమస్యలను అప్పటి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేశానని గుర్తుచేశారు. జెడ్పిటిసిలు, ఎంపీపీలు తమ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోనీ తమని ఎన్నుకున్న ప్రజలు, ప్రాంత సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. ఏవైనా ముఖ్య సమస్యలు ఉంటే సర్వసభ్య సమావేశం పెట్టే వరకూ వేచి చూడకుండా, తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.
పల్లెలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందనీ, స్నేహపూర్వక వాతావరణంలో
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలనీ సూచించారు. ప్రభుత్వం కొలువుతీరిన
వారం రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేశామని, హామీ ఇచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండ్లు కళ్ళలాగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా అమలయ్యేలా జిల్లా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా అధికారులు పరిష్కారం చూపాలన్నారు. మండలాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీపీలు, జడ్పిటిసిలతో సహా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అలసత్వం చూడకుండా వెలువంటనే పరిష్కారం చూపాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆదికి శుభాకాంక్షల వెల్లువ
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షల వెల్లువెత్తాయి. శనివారం జిల్లా ప్రజా పరిషత్ సభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయం కు వచ్చారు. దీంతో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య,
జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా అధికారుల సంఘం ( డోర్స్) సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >