| Daily భారత్
Logo




సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-08-14 08:34:58

Share: Share


సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ ధన్ పాల్ సూర్యనారాయణ  ప్రజలందరికీ ముఖ్య సూచనలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీటి నిల్వలు,మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

పరిసర ప్రాంతాలలో నీటినిల్వ వ్యర్థలను తొలగించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, మురుగునీటి కాలువలు, విద్యుత్ స్తంభాలు, తీగల వంటి ప్రదేశాలలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న పిల్లలు బయటికి వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు వారిని గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని  సూచించారు.

మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రదేశాలలో హెచ్చరికల బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని, వాటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >