Posted on 2025-08-13 16:37:39
42 శాతం బీసీ రిజర్వేషన్ కు బిజెపి ఎంపీలు అనుకూలమా...? వ్యతిరేకమా...?
-ప్రజల ముందే వారి వైఖరిని స్పష్టం చేయాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ధర్పల్లి మండలం లోని రామడుగు గ్రామ శివారులో ఉన్న రామడుగు ప్రాజెక్టుకు సంబంధించిన కుడి ఎడమల కాలువల నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నీళ్లను విడుదల చేశారు. రామడుగు ప్రాజెక్టు కట్టమీద ఉన్న కట్ట మైసమ్మ కి పూజ చేసి, అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామడుగు ప్రాజెక్టు నుండి వివిధ గ్రామాలకు ఆయకట్టు ద్వారా నీళ్లు వెలుతాయని అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు క్రింద ఉన్న పంట పొలాలు ఎండి పోతున్న యని రైతులు రూరల్ ఎమ్మెల్యే కు విన్నవించుకోవడంతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి,ఆయకట్టు పంట పొలాలకు బుధవారం సాగునీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. సుద్దులం, రామడుగు, మైలారం, కోరట్పల్లి, కలి గౌడ్ చింతలూరు మనోహరాబాద్, వంటి గ్రామాల పంట పొలాలకు నీరు చేరుతుందని అన్నారు. రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్షమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు, అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్ కు టిఆర్ఎస్ బిజెపి నాయకులు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజాంబాద్ ఎంపీ అరవింద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లు బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకామా...? అనుకూలమా..? చెప్పాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొరకు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలని అన్నారు. లేకపోతే బిజెపి ఎంపీలను గ్రామాల్లో తిరగకుండా బీసీ ప్రజలు తరిమి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, డిష్పల్లి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, ధర్పల్లి మండల తహసిల్దార్ శాంత, ఎంపీడీవో, రామడుగు వీడీసీ చైర్మన్ రాజారెడ్డి, సుద్దులం విడిసి చైర్మన్ సాయి రెడ్డి, రాముడు గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్,సుద్దులం గ్రామ శాఖ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >