Posted on 2025-08-13 16:34:21
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కేరళ రాష్ట్రంలో ఆగస్టు 2 నుండి 7 వరకు నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్ పవర్ లిప్టింగ్ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 73 సంవత్సరాల వయసులో హార్ట్ బైపాస్ సర్జరీ సైతం లెక్కచేయకుండా ఆరు నెలల అనతి కాలములోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలను అధిగమించి, జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలను గెలుచుకొని చరిత్ర సృష్టించిన ఘనత భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్ రావు అని తెలిపి పవర్ లిప్టింగ్ ఇండియా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు జీవితాన్ని నిర్వచించలేవని , బలానికి వయసు అడ్డు కాదని, సంకల్పం అడ్డంకులను మైలురాళ్లుగా మారుస్తుందని తెలిపారు. ఈ విజయం వృద్ధాప్యానికి పరిమితం కాకుండా కొత్త అవకాశాలుగా చూడాలని సందేశాన్ని అన్ని వయసుల వారికి అందిస్తుందని తెలిపారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >