Posted on 2025-08-13 14:55:53
డైలీ భారత్, వరంగల్: పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ నల్లబెల్లి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్‌ఎస్ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ, డీసీపీ చేతుల మీదుగా మొక్కలను ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సిఐ సాయి రమణ, నల్లబెల్లి, ఖానాపూర్ ఎస్.ఐలు గోవర్ధన్, రఘుపతి పాల్గోన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >