| Daily భారత్
Logo




కాంగ్రెస్ అప్పు తెలంగాణకు ముప్పు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

News

Posted on 2025-08-13 18:37:50

Share: Share


కాంగ్రెస్ అప్పు తెలంగాణకు ముప్పు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్

అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్

20నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసింది?

ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదు

కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు..

కాంగ్రెస్ పాలనలో అనాధాలా నిజామాబాద్ జిల్లా

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టాను సారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో రూ.2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రతీ నెలా రూ. 11వేల కోట్లు, రోజుకు రూ. 360 కోట్లు, గంటకు రూ. 15కోట్లు, ప్రతి నిమిషానికి రూ. 25లక్షల  చోప్పున అప్పులు చేసి ఒక కొత్త పథకం చేపట్టిన పాపాన పోలేదు. మరి ఆ రూ. 2.2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినయి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు.

కనీసం ఒక్క ఎన్నికల హామీని కూడా  అమలు చేయలేద న్నారు.

కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు  కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమేనని,

సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన రూ.75వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల కోట్లే తెలంగాణ అప్పు అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం ఇంత కాలం విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు.

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ రూ. 4.16 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు అని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు  కేసీఆర్ ప్రభుత్వ కీర్తి  కిరీటాలుగా జీవన్ రెడ్డి అభివర్ణించారు.

కాంగ్రెస్ చెప్పు కోవడాని కేముంది? కాళేశ్వరం డ్యామా? కల్యాణ లక్ష్మి స్కీమా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు అప్పులు తెచ్చి జేబులు నింపు కుంటున్నారని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయకు పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. అప్పుగా తెచ్చిన డబ్బు ఏం చేశారంటే చెప్పడానికి కోటి ఎకరాల భూమికి సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని, ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ,  48 వేల చెరువులను పునరుద్ధరించిన మిషన్ కాకతీయ, దాదాపు 13 లక్షల మంది పేద ఇంటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా యని ఆయన పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2.2 లక్షల కోట్లతో తట్టెడు మట్టి ఎత్తలేదని, ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నివర్గాల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి దిక్కుమాలిన పాలనలో  రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారూ సంతోషంగా లేరన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదు అనడం అతిశయోక్తి కాదన్నారు.

కేసీఆర్ పాలనంటే ప్రతీ ఇంట్లో సంతోషం, ప్రతీ కంట్లో ఆనందం అని,

కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం అన్నట్టుగా ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆటకెక్కాయని,  420 హామీలు బుట్టదాఖా లయ్యాయని జీవన్ రెడ్డి పేర్కొంటూ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క వర్గం వారికి ఏమిచ్చారో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.

రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, రైతుభరోసా రాలేదని,

మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఇవ్వడం లేదని, కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని,

చేనేత కార్మికులు మళ్లీ  సమస్యల పాలవుతున్నారని,

గీత కార్మికులకు సర్కార్ భరోసా లేదని ఆయన తెలిపారు.

మత్యకారులకు చేప పిల్లలు ఇవ్వరు. యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ నిలిచిపోయింది.

దళిత బంధు, బీసీ బంధు ఊసేలేదు.

పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్ల సందర్బంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తామన్న తులం బంగారం అతీగతి లేదు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 25వందల చొప్పున ఇస్తామన్న హామీకి దిక్కే లేదు.

నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వరు.

నిరుద్యోగ భృతి ఏమైందో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి.

తెలంగాణ అడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదు.

క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఇవ్వడం లేదు.

అవ్వాతాతలకు పెంచుతామన్న పెన్షన్లు ఇవ్వడం లేదు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలతో పాటు పిల్లల సంరక్షణకు విలువైన వస్తువులు ఇచ్చే  కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.

కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటి ఆలనాపాలనా చూసే దిక్కులేదు అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ది మంచి ప్రభుత్వం, రేవంత్ ది ప్రజలను ముంచే ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు.సంపద పెంచుడు పేదలకు పంచుడు కేసీఆర్ విధానమన్నారు.

33మెడికల్ కాలేజీలు నిర్మించడం, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ భవనాలు కట్టడం,యాదాద్రి వంటి దేవాలయాల నిర్మాణం కేసీఆర్ విజయాలన్నారు.

పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి రోగాలు ప్రబలు తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి  ప్రజలను ఏమార్చి 1.5 శాతం ఓట్లతో ఒడ్డున పడ్డరని కాంగ్రెస్ పై ఆయన ధ్వజమెత్తారు.

20 నెలలు తిరగక ముందే పాలన చేతకాక చేతులెత్తేసి 

లేకి కూతలు కూస్తున్నడని, తెలంగాణ పరువును బజారున పడేస్తున్నడని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదన్నారు.

కాంగ్రెస్ పాలనలో తిట్టింది తప్ప పెట్టింది లేదన్నారు. జిల్లా ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.

పట్టించుకునే దిక్కులేక జిల్లా అనాధాల మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాకు మంత్రి లేరని, జిల్లా ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏ నాడూ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అవతారమెత్తి దోచుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెప రెప లాడటం ఖాయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు   ప్రభాకర్,సుజీత్ సింగ్ ఠాకూర్,రాజేశ్వర్ రెడ్డి, మాస్తప్రభాకర్,ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్,శ్రావణ్,పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >