Posted on 2025-08-13 17:28:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మన్ పల్లి, పాల్దా గ్రామాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిర్మన్ పల్లి రైతు వేదికను కలెక్టర్ సందర్శించగా, వ్యవసాయ విస్తీర్ణ అధికారి (ఏఈఓ) అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈఓ కూడా చేరుకోగా, రైతు వేదిక వద్ద రైతులకు అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ కలెక్టర్ నిలదీశారు. ప్రస్తుతం భారీ వర్ష సూచన నేపధ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్ తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పనితీరును పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాదికారులకు సూచించారు. అక్కడి నుండి పాల్ద గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, మెనూ పక్కాగా అమలు కావాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏ.పీ.ఓను ఆదేశించారు. నీటి సంరక్షణ కోసం అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్మించిన సోక్ పిట్ ల నిర్వహణ సజావుగా జరిగేలా, వాటి వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. కాగా, పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరవగా, ముఖ గుర్తింపు విధానం ద్వారా 25 మంది విద్యార్థులు హాజరు మాత్రమే ఆన్లైన్ లో నమోదు చేయడాన్ని గమనించిన కలెక్టర్, మిగతా విద్యార్థులు ఎఫ్.ఆర్.ఎస్ హాజరు విషయమై ప్రధానోపాధ్యాయుడు సుమన్ రెడ్డిని ప్రశ్నించారు. సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేదని హెచ్.ఎం తెలుపగా, కలెక్టర్ తన సమక్షంలో విద్యార్థులు హాజరును ఎఫ్.ఆర్.ఎస్ విధానంలో నమోదు చేయించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడితే, సంబంధిత విభాగం అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో ఎవరిని సంప్రదించాలి అనే విషయమై జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్.ఎంలకు టెక్నికల్ పర్సన్ ఫోన్ నెంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని చేరవేయాలని ఫోన్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, పనితీరును పరిశీలించారు. అనంతరం సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. రైతులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో యూరియా, ఇతర ఎరువులను అందజేశామని సొసైటీ సీఈఓ రాకేష్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంకనూ అవసరమైన వారికి ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వీలుగా 10 టన్నుల వరకు ఎరువుల కోసం ఇండెంట్ పంపామని, ఈ రోజు మద్యాహ్నం వరకు ఎరువుల నిల్వలు చేరుకుంటాయని తెలిపారు. ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పాల్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులు అందరూ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >