Posted on 2025-08-13 13:57:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తో కలిసి రైల్వే, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ని కలుస్తానని తెలిపారు. నగర శివారులోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రధానంగా మాధవనగర్కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అర్సపల్లి ల్యాండ్కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.
వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు.
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >