| Daily భారత్
Logo




హామీల అమలులో కాంగ్రెస్ ఫ్లాప్, చీటింగ్ లో బీజేపీ టాప్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

News

Posted on 2025-08-10 14:57:55

Share: Share


హామీల అమలులో కాంగ్రెస్ ఫ్లాప్,  చీటింగ్ లో బీజేపీ టాప్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

లోకల్  బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం

ఏ గ్రామంలో చూపినా మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్నదే జనం ఆకాంక్ష

ఇకనుండి జిల్లాంతా తిరుగుతా, బీ ఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తా

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశా..

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక  సంస్థల ఎన్నికల "పోరు"  ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రంలో  కేసీఆర్ మళ్ళీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నందిపేట్ మండల పర్యటన సందర్భంగా కుద్వాన్ పూర్ వంతెనను  జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 

హామీల అమలులో రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం  అట్టర్ ఫ్లాప్ కాగా,  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను చీటింగ్ చేయడంలో  టాప్ లో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఇంకా 30వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న జీవన్ రెడ్డి రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు  ద్రోహం  చేశారని మండిపడ్డారు. కరెంట్  ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం నెలకొందన్నారు. రేవంత్‌ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో  చెత్తా చెదారం, పందులు,దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని,

ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ 

తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే..  ఇప్పుడెట్లుంది అని ప్రశ్నించారు. ఈనగాచి నక్కలపాలు చేసినట్లయిందని,

పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ కాంగ్రెస్, బీజేపీల పతనం షురూ అయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పేరు వింటేనే  ప్రజలు భగ్గుమంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని  అన్ని గ్రామాలు నినదిస్తున్నాయన్నారు. 

లోకల్  బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు.

ఏ గ్రామంలో చూపినా మళ్ళీ కారు  రావాలి, సారు రావాలి, కేసీఆర్ సీఎం కావాలి అన్నదే జనం ఆకాంక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పల్లె పల్లెలో, పట్టణాలలో మళ్ళీ  గులాబీ జెండా రెపరెపలాడటం తథ్యమన్నారు. ఇకనుండి జిల్లాంతా తిరుగుతానని, బీ ఆర్ఎస్ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తానని ఆయన వెల్లడించారు. పదేళ్ళ బీ ఆర్ఎస్ పాలనలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

రూ.150 కోట్లతో పంచెగూడ వంతెన నిర్మాణం  పూర్తి చేసి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గించిన ఘనత  కేసీఆర్ దన్నారు.

మరో వంద కోట్లతో  నియోజకవర్గం లోని పలు వంతెనలు నిర్మించిన కేసీఆర్  కు జీవన్ రెడ్డి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి ల మధ్య ప్రోటోకాల్ రగడ తప్ప  వారు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం అని ఆయన విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో మంజూరైన స్కీమ్ లకే కొబ్బరి కాయలు కొట్టడం, పాతగోడలకు సున్నాలు కొట్టి మందికి పుట్టిన బిడ్డ మా గొప్పేనని జబ్బలు చర్చుకోవడం తప్ప ఊడబోడిచిందేమీలేదని ఆయన ఎద్దేవా చేశారు. కుద్వాన్ పూర్ –కొండాపూర్ రోడ్డు వెంటనే వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి  తాము శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు.

పదేళ్ళ తన శ్రమ, తనదైన మార్క్ అభివృద్ధి ఆర్మూర్ నియోజకవర్గానికి ల్యాండ్ మార్క్ గా జీవన్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామ న్నారు.

Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >