Posted on 2025-08-09 13:58:23
సంతోషిమాత జన్మదినం సందర్భంగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్ లోని అతి ప్రాచీనమైన మహాశక్తి హనుమాన్ ఆలయంలో శనివారం సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిఅర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా భజన మండలి వారు నిర్వహిస్తున్న భజన గీతాలను చూసి ఎమ్మెల్యే స్టేజిపై ఎక్కి హనుమాన్ మంత్రాన్ని ఆలపించారు. ఆలయం నుండి పురవీధుల గుండా పల్లకి సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన పురాతనమైన ఈ ఆలయంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇక్కడ ఆలయంలో ఉన్న పలు దేవతల మూర్తులకు ఏ కష్టాలు ఉన్న భక్తితో నిష్టతో పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి సత్య గిరి, కోశాధికారి వినోద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >