| Daily భారత్
Logo




రాజకీయ నాయకుల మోసపు మాటలు విని విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

News

Posted on 2025-08-07 11:40:46

Share: Share


రాజకీయ నాయకుల మోసపు  మాటలు విని విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

మళ్లీ ఉద్యమాలు ఉప్పెనల పేరిట రాజకీయ నాయకులు విద్యార్థులను మోసం చేసే కుట్ర పన్నుతున్నారు..

సామాన్య పేద రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వ అసమర్ధత వల్ల సినీ ప్రములకు ఎలా ఇస్తారు..

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాజకీయ నాయకుల మాటలు విని ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు రాజకీయ నేతల వలలో పడి మోస పోవద్దని వారి రెచ్చగొట్టే మాటలవల్లే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారని ఇది ఎంతో బాధాకరమైన విషయం అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రైట్ బిగినర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ పార్టీ లో ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఉద్యోగాలు దొరుకుతాయని ఆనాడు 1200 మంది ఆత్మబల్లి దానాలు చేసుకున్నారని, వారి ఆత్మ బలిదానం వల్లే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులకు మంత్రులు ఎంపీల పదవులు వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎంతో మేధాశక్తి ఉన్న, తెలివిమంతులైన విద్యార్థులని దయచేసి రాజకీయ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన అన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ద్వారా మరోసారి గ్రామీణ ప్రాంత విద్యార్థులను మోసగించడానికి రాజకీయ పార్టీలు  వారి చదువులకు ఆటంకం కలిగిస్తున్న దుర్మార్గులు రాజకీయ పార్టీ నేతలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పుడు కెసిఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆబంధు ఈ బందు ఆపతకం ఈ పథకం అనుకుంటూ ఎన్ని రోజులు ప్రజలను మోసగించి బతుకుతారని విమర్శించారు. కోరి తెచ్చుకున్న, తెలంగాణలో నిరుద్యోగులను విద్యార్థులను రాజకీయ నేతలు రెచ్చగొడుతున్నారు అని ఆరోపించారు. హైదరాబాద్లో పేద విద్యార్థులేము ఐదు రూపాయల భోజనం చేస్తుంటే రాజకీయ నేతల వారసులు వారు మాత్రం హై లెవెల్ హోటల్లో భోజనం చేయడం నిజమే నిజంగా దుర్మార్గమని అన్నారు. అసలైన రైతులకు నిజమైన రైతులకు రైతుబంధు రైతు సంక్షేమం లాంటి పథకాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓ ఫిలిం సెలబ్రిటీ కి రైతుబంధు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ప్రత్యేకంగా ఆకర్షించాయి.


కార్యక్రమంలో హోటల్ మేనేజ్మెంట్ సీఈవో ఫౌండర్ మలోత్ సాయి ప్రసాద్ నాయక్, మరో ముఖ్య అతిథిగా మహేంద్ర కుమార్, జి సి కన్సల్టెంట్ షరీఫ్, బ్రైట్ స్కై అశ్విల హాస్పిటలిటీ సర్వీస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >