Posted on 2025-08-07 12:47:37
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ‘‘నరాలను పోగులుగా చేసి..తమ రక్తాన్ని రంగులుగా అద్ది.. గుండెలను కండెలుగా మార్చి..చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి..మనిషికి నాగరికతను అందించిన.. ఘనత చేనేత కార్మికులది అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అహింసా ఉద్యమానికి నాంది పలికింది చేనేత రంగం అన్నారు. ఆనాడు విదేశీ వస్త్రాల బహిష్కరించాలనే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమాన్ని ఉదృతం చేయడంలో కీలక పాత్ర వహించరాని అన్నారు.1905 ఆగస్టు 7న విదేశీ వస్తువుల బహిష్కరణలో కీలకపాత్ర పోషించిన రోజును జాతీయ చేనేత దినంగా ప్రకటించాలన్న మన తెలంగాణ బిడ్డ రాహుల్ ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో 2015లో అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 గా ప్రకటించడం చేనేత రంగానికి దక్కిన గౌరవం అన్నారు. కేంద్రప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం కింద వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ, రుణాలు అందిస్తూ చేతి వృత్తుల వారిని ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు నేసిన ఘనత మన నేతన్నలది అలాంటి నేతన్నలు ఈరోజు అన్నమో రామచంద్రా అంటూ బతుకు జీవనం కోసం గుజరాత్, మహారాష్ట్ర లకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఆగడం లేదన్నారు. నేడు చేనేత కార్మికులు బీడీ కార్మికులుగా మారుతున్న దుస్థితిని మనం చూస్తున్నాం అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరల పంపిణీలో దోపిడీకి తెరలేపి మన చేనేత కార్మికులకు మొండి చేయి చూపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేనేత కార్మికుల బతుకు జీవనం మాత్రం మారడం లేదు కారణం వారికి ప్రభుత్వం చేయూతను అందించడంలో విఫలం చెందుతుందని. వడ్డీ లేని రుణాలు లేవని,రుణమాఫీ లేదని, చేనేత యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడం లేదని, చివరికి చేనేత కార్మికులు నూలు పోగులతో ఉరేసుకోవాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఉందని మండిపడ్డారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ వారికి అండగా నిలవాలని డిమాండ్ చేసారు. అనంతరం చేనేత కార్మికులను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, చేనేత సాకార సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సత్యపాల్, ప్రసాద్,విజయలక్ష్మి బిజెపి నాయకులు కిషోర్, నాగరాజు, బొట్టు వెంకటేష్, పల్నాటి కార్తీక్, వేరేందర్, రవి, లక్ష్మణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >