Posted on 2025-07-23 18:30:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ కు,దేవుని పల్లి మెడికల్ ఆఫీసర్ కు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ దేవుని పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు వైద్యాధికారి, డిప్యూటీ డిఎంహెచ్ఓ దోమకొండ హాజరు లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలు, ఆస్పత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >