Posted on 2023-12-19 05:50:07
డైలీ భారత్, ములుగు:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు.
జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధి కంగా ఉంటుంది,
దీంతో కొందరు భక్తులు రెండు నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండడం గమనార్హం.
మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నప్పటికీ… ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తోంది. జాతర ముందు రోజుల నుంచి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపనుంది. అయితే ఇప్పటికే మేడా రానికి తరలివస్తున్న భక్తుల కోసం బస్సులను నడుపు తున్నట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత ఇప్పటికే ప్రకటించారు.
భక్తుల సౌకర్యార్ధం ఈనెల 17 నుంచి స్పెషల్ బస్సు లను ప్రారంభించారు. ప్రతీ బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్ నుంచి ప్రతీ 45 నిమిషాలకు ఒక బస్సును అందుబాటు లో ఉంచారు.
భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచనున్నారు. ఇదిలా ఉంటే జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది.
ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి రూ.8.28కోట్లు, పోలీస్ శాఖకు రూ.10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు.. ఇలా వివిధ శాఖలకు నిధులు కేటాయించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈసారి జాతర ఏర్పాట్లు, నిర్వహణలో తమ మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >