Posted on 2025-07-22 18:57:57
చదువే ఆయుధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన జిల్లా పాలనాధికారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మోపాల్ మండలం కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, బాత్ రూంలు, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. పిల్లలు ఆరు బయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, పాఠశాల ప్రిన్సిపాల్ మురళిని ఈ విషయమై ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరు బయట భోజనం ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనం ఇంకనూ తమకు అప్పగించలేదని ప్రిన్సిపాల్ తెలుపగా, ప్రాంతీయ సమన్వయకర్త (ఆర్సీఓ)ను కలెక్టర్ ఫోన్ లో సంప్రదించి, నూతన డార్మెటరీ బ్లాక్ విషయమై ప్రశ్నించారు. రేపటి లోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన భవనం విద్యార్థులకు ఉపయోగపడకపోతే ఎలా అని నిర్వాహకులపై అసహనం వెలిబుచ్చారు. పాత బాత్ రూం అస్తవస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, డార్మెటరీ బ్లాక్ లోని బాత్ రూమ్ లను విద్యార్థులు వినియోగించేలా చూడాలన్నారు. కాగా, డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన కూరగాయలకు బదులు ఇతర కూరగాయలతో కర్రీ వండడం పట్ల నిర్వాహకులను నిలదీశారు. డైట్ ప్లాన్ ను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. కాగా, పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఇచ్చారా అని పిల్లలను ప్రశ్నించగా, పర్యావరణం సబ్జెక్టు పుస్తకం పంపిణీ కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరచిన పర్యావరణం పుస్తకాలను తెప్పించి అప్పటికప్పుడు తన సమక్షంలోనే విద్యార్థులకు పంపిణీ చేయించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యను ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తి నింపారు. విద్యార్ధి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >