| Daily భారత్
Logo




"మద్యపానం మానసిక సమస్యలను సృష్టిస్తుంది" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2025-07-22 09:31:34

Share: Share


"మద్యపానం మానసిక సమస్యలను సృష్టిస్తుంది" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

- కార్మికుల మనో వికాస సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు పద్మనగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మద్యపాన వ్యసనం పై మనో వికాస సదస్సును నిర్వహించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యపాన వ్యసనం మానసిక సమస్యలను సృష్టిస్తుంది అని అన్నారు. మద్యపానం దీర్ఘః కాలిక మానసిక ఒత్తిడికి గురిచేసి మెదడు, నరాల బలహీనతలు కారణమవుతుందని అన్నారు.

మద్యం ఒక్కసారిగా మానివేస్తే నిద్ర సమస్యలు, కాళ్ళు చేతులు వణుకడం, శరీరం అదుపు తప్పడం, మానసికంగా భ్రమలు బ్రాంతులు ఏర్పడి పిచ్చిగా ప్రవరిస్తారని అన్నారు.

చాలా సార్లు, ఫిట్స్, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డ కట్టుట, డిలీరియం లాంటి  సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు.

మద్యం మానుకునేందుకు మైండ్ కేర్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల యందు అధునాతన చికిత్స, కౌన్సిలింగ్ అందుబాటులో ఉందని వివరించారు. తమను ఈ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు.

అత్యవసర సమయంలో 8801888805 నెంబరు కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ పొందవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా మనో వికాస కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

ప్రభుత్వం కార్మికుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ మహిళా శక్తి చీరల ఆర్డర్లు, నేతన్న భీమ, త్రిఫ్ట్ పథకం, యార్న్ డిపో ఏర్పాటు, యార్న్ సబ్సిడీ పథకాలను ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిందని అన్నారు.


ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు మర మగ్గాలు వస్త్రోత్పత్తి దారుడు ఏనుగుల మనోజ్, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

ఉక్రెయిన్ దాడిలో కేరళకు చెందిన భారత నావికుడు మృతి

Posted On 2026-07-21 19:01:13

Readmore >
Image 1

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పి.డి. చట్టం

Posted On 2026-07-21 17:10:38

Readmore >
Image 1

జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి

Posted On 2026-07-21 15:56:05

Readmore >
Image 1

సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

Posted On 2026-07-21 15:22:53

Readmore >
Image 1

తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

Posted On 2026-07-21 15:01:38

Readmore >
Image 1

సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా

Posted On 2026-07-21 14:56:26

Readmore >
Image 1

నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన

Posted On 2026-07-21 13:45:51

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ

Posted On 2026-07-21 12:52:04

Readmore >
Image 1

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు

Posted On 2026-07-21 07:46:47

Readmore >
Image 1

కూలుతున్న పైకప్పు.. వణుకుతున్న పసిప్రాణాలు!

Posted On 2026-07-21 07:12:29

Readmore >