Posted on 2023-12-18 13:55:04
డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్లలో ఓ ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పట్టణానికి చెందిన బూర నరేందర్ వృత్తి రీత్యా హాస్పిటల్ పొప్రేటర్. పాత బస్టాండ్ సమీపంలోని 5-6-70/71/72 నెంబరు గల భవనాన్ని హాస్పిటల్ నిర్వహణ నిమిత్తం సిరిసిల్ల వాసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న రాచ మధుసూదన్ వద్ద 4 సంవత్సరాల 4 నెలల 10 రోజులకు లీజుకు తీసుకుని ఆసుపత్రి నడిపిస్తున్నాడు. 31-12-2025 వరకు నరేందర్ తీసుకున్న లీజు చెల్లుబాటులో ఉంది. అయితే ఇంటి యజమాని భవనం లీజు గడువు పూర్తి కాకముందే అక్రమంగా కాళీ చేయించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల కోర్టులో నరేందర్ దావా వేశారు. దావా నెంబరు OS 446 ఆఫ్ 2023 కోర్టులో పెండింగులో ఉన్న క్రమంలో సదరు యాజమాని భవనాన్ని సిరిసిల్ల కి చెందిన అడేపు మురళి, అనే వ్యక్తికి రాచ మధుసూదన్ అమ్మే ప్రయత్నం చేస్తూ, తనకు తెలియకుండా ఆసుపత్రి బోర్డులు తొలగించి, భవనానికి తాలం వేసి తనపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడని, తనకు తెలియకుండా ఆ భవనంపై ఎవ్వరూ కుడా లీజుకు తీసుకోవడం, స్వరూపాన్ని మార్చడం, కొనుగోలు విషయంలో లావాదేవీలు చేయకూడదని శనివారం కోర్టు నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. కాదని ఎవరైనా ముందుకు వస్తే తాను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >