| Daily భారత్
Logo




త్వరలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్న వేళ ఫ్యాక్షన్ రాజకీయలకు తెరలేపుతున్న పలు రాజకీయ పార్టీలు

News

Posted on 2025-07-17 15:30:56

Share: Share


త్వరలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్న వేళ ఫ్యాక్షన్ రాజకీయలకు తెరలేపుతున్న పలు రాజకీయ పార్టీలు

ఇక ఎన్నికల కోడ్ కూసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజల ఆందోళన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నేరుగా ప్రశాంత్ రెడ్డి ఇంటి పై దాడి చేసేంతవరకు చేరుకున్నాయి ఇందూరు రాజకీయాలు. గత రెండు రోజుల క్రితం ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితులకు సంక్షేమ నిధి అలాగే గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న మన కార్మికులకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మాటలను గల్ఫ్ బాధితుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని ప్రశాంత్ రెడ్డి విమర్శించడంతో దీనికి స్పందించిన డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు ఆ సవాల్లోనే చర్చి చర్చించుకుందాం అని ప్రతిస్పందించడంతో చెలరేగిన రాజకీయమంటలు ఒక్కసారిగా చిల్లరీగాయి అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారం లేకపోవడంతో అబద్ధాలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి గురువారం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి అందులో తెలియజేశారు. అయితే ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో తెలియ చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు నిజాలు తెలియజెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి పోలీసులు ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీ జిల్లా అగ్రనేతలను హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు గురువారం మధ్యాహ్నం వేల్పూర్ లోని ప్రశాంత్ రెడ్డి నివాసంలోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో వేల్పూర్ లో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది. అయితే ఇంకా ఎన్నికలు రాకముందే ఓ వారం రోజుల్లో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు రాజకీయ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఏకంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఇండ్లపై దాడికి దిగుతున్నారంటే ఇక వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >