| Daily భారత్
Logo




వేల్పూర్ లో మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడ్డ కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్

News

Posted on 2025-07-17 14:20:36

Share: Share


వేల్పూర్ లో మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడ్డ కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్

బీఆర్ఎస్ కార్యకర్తల దాడి... ఉద్రిక్తంగా మారిన వేల్పూర్

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం లో భాగంగా గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి కార్యకర్తల చేతులో తన్నులు తిన్నాడు. వేల్పూర్ పట్టణ కేంద్రంలో 163 బీ ఎన్ యస్ యస్ అమలులో ఉండగా, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ పోలీసుల పహార ఉండగా అందరి కన్నులు కప్పి ఎమ్మెల్యే ఇంట్లో తన అనుచరుడితో కలిసి చొరబడ్డారు. వారిద్దరు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలిసిపోయి వారికి తెలియకుండా అక్కడ జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ నాయకులకు లైవ్ పెట్టి వీడియో చూపించే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని చితికబాదారు.అంతలోనే అల్లరి శబ్దం విన్న ఎమ్మెల్యే పై అంతస్తూ నుండి చూసి ఆయన్ని ఏమనకండి వదిలేయండి అని శ్రేణులకు సూచించారు. దాంతో నాయకులు వదిలేశారు.

అంతట్లో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని నంగి దేవేందర్ రెడ్డిని బీ ఆర్ యస్ కార్యకర్తల నుంచి ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్లారు. నిషిద్ద సెక్షన్ అమలులో ఉండగా, పోలీసులు కాపాల ఉండగా ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి వీడియో తీస్తూ లైవ్ పెట్టె ప్రయత్నం చేయడం అంటే పోలీసులు అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చెయ్యాలని, సెక్షన్ అమలులో ఉండగా పోలీసుల ఆదేశాలను బేఖతార్ చేసిన ఆయన్ని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు.


Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >