| Daily భారత్
Logo




తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెట్టు నిదర్శనం బోనాల పండగ

News

Posted on 2025-07-17 14:17:47

Share: Share


తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెట్టు నిదర్శనం బోనాల పండగ

నవదుర్గ దేవి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాత కలెక్టరేట్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా  ఆనవాయితీగా నిర్వహించే బోనాల ఉత్సవాలను శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ దేవీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్  ఎమ్మెల్యే  ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లు హాజరై బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే పాత కలెక్టరేట్ మైదానంలో ఒకప్పుడు చిన్నగా తో ఎంతో మహిమగల శ్రీశ్రీశ్రీ నవదుర్గ దేవి ఆలయం ఎంతో మహిమగల అమ్మ అమ్మవారు అని ఎంతో ప్రసిద్ధికి ఎక్కిందని ఆయన అన్నారు. కోరిన కోరికలు తీరుస్తూ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా ఉద్యోగులచే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తూ పరోక్షంగా అమ్మవారి రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యాన్ని అందిస్తూ ఒకప్పుడు చిన్నగా ఉండే అమ్మవారి ఆలయం ఆలయ కమిటీ నిర్వాహకుల కృషితో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయ విషయం అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు జిల్లా కలెక్టరేట్ ఈ ప్రాంతంలో ఉండేదని తాను బదిలీపై వచ్చిన తర్వాత అధికారుల ద్వారా తెలిసిందని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో దైవ సన్నిధిలో కలెక్టర్ కార్యాలయం అప్పుడు ఉండడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అప్పట్లో కలెక్టరేట్ ఇక్కడ ఉన్న సమయంలో పనిచేసిన కలెక్టర్లు ఇతర అధికారులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా  ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేవి మన తెలంగాణ సాంస్కృతికి , సాంప్రదాయానికి నిదర్శనం అని , మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యము ఎంతో పవిత్రతతో కలిగినదని, అమ్మవారు మన జిల్లా ప్రజలందరినీ ఆశీర్వదించాలని అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరారు.


కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >