| Daily భారత్
Logo




మంత్రి వివేక్‌కు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే

News

Posted on 2025-07-17 13:11:18

Share: Share


మంత్రి వివేక్‌కు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే

డైలీ భారత్, మెదక్‌: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో ఆయన కాన్వాయ్‌ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయని, దీంతో కార్ల ముందు భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, ప్రమాదానికి ముందు ఆయన నర్సాపూర్‌లో పర్యటించారు. అర్హులందరికీ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళ ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం బాగుంటుందన్నారు. అలాగే, విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం చేస్తుండగా తన కాన్వాయ్‌‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..

Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >