| Daily భారత్
Logo




అమాయక ప్రజలను తప్పుడు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర పన్నె ప్రయత్నం చేయడం సిగ్గుచేటు

News

Posted on 2025-07-17 15:35:38

Share: Share


అమాయక ప్రజలను తప్పుడు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర పన్నె ప్రయత్నం చేయడం సిగ్గుచేటు

దమ్ముంటే బహిరంగ సవాల్ కు రావాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్ లో కనువిప్పు కార్యక్రమానికి వెళ్లేందుకు గురువారం ఆయన సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నా విషయం తెలిసిందే. అనంతరం నగరంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే మతి స్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని భావిస్తే ఎందుకు చర్చకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కొరకు సెల్ ను ఏర్పాటు చేసి సహాయమందిస్తుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో 55 మందికి అదేవిధంగా, ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 18 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలకు సహాయం అందించామన్నారు.

వీటన్నింటిని ఆధారాలతో ప్రశాంత్ రెడ్డికి చూపించి ఆయన కండ్లు  తెరిపించడానికి గురువారం వేల్పూర్ లో కనువిప్పు కార్యక్రమానికి పిలుపు ఇచ్చామన్నారు. ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పై, ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకారాల భూమి, పెంచిన ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగ యువతకు రూ. 3000 మృతి అంశాలపై చర్చకు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన తాను ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, సన్నపు వడ్లకు బోనస్ వాటి విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని మానాల మోహన్ రెడ్డి సవాల్ చేశారు. బహిరంగ చర్చకు రాకుండా ముఖం చాటేస్తున్న ప్రశాంత్ రెడ్డి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నాయకులను, ప్రశాంత్ రెడ్డి బయట తిరగనియ్యమని మానాల మోహన్ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, మాజీ కార్పొరేటర్ రోహిత్ ,మాజీ యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, జిల్లా ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పంచారెడ్డి చరణ్, దత్తాద్రి, మణికంఠ, హరీష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >