Posted on 2025-07-16 16:51:45
వి హెచ్ పి ఎస్ నవీపేట్ మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. అందుకే ఈనెల 18న నిజాంబాద్ జిల్లా కేంద్రంలో చేయూత, వికలాంగుల, పెన్షన్ దారుల సనహక కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000, కండరాల క్షీణించిన వారికి 15000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని వీహెచ్పీఎస్ నవీపేట్ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరెండు సంవత్సరాలు దగ్గరికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని అన్నారు.
ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఈ నెల 18న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని సామాజిక పెన్షన్ దారుల, వికలాంగుల మరియు బీడీ కార్మికుల పెన్షన్ దారుల సమావేశం నిజామాబాద్ నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లా నలువైపుల నుంచి పెన్షన్ దారుల వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వి హెచ్ పి ఎస్ నవిపేట్ మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ , గంగాధర్ పంతులు , జ్ఞానేశ్వర్ , గోవింద్ , ఎం ఎస్ పి నాయకులు చింతల సాయన్న , సంతోష్ , చరణ్ , అరుణ , అంజలి ,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >