| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో ఇష్టా గోష్టిలోగోష్టిలో పాల్గొన్న గవర్నర్

News

Posted on 2025-07-16 20:20:48

Share: Share


నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో ఇష్టా గోష్టిలోగోష్టిలో పాల్గొన్న గవర్నర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాకు చెందిన  వివిధ రంగాలలో  ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్టి జరిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, కలెక్టరేట్ కు విచ్చేసిన గవర్నర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ తదితరులు గవర్నర్ ను పూలబొకేలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా సందర్శించారు. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలియజేయగా, గవర్నర్ ఎంతో ఆసక్తితో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.

       అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రంగాలలో  ప్రఖ్యాతిగాంచిన జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్టి భేటీ నిర్వహించారు. ఆయా రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖుల గురించి గవర్నర్ పేరుపేరున వివరాలు తెలుసుకుని అభినందించారు.  

 పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గూగులోత్ సౌమ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రమేష్ కార్తీక్ నాయక్ లతో పాటు బల్లాష్టు మల్లేష్ (థియేటర్ ఆర్టిస్ట్), కందకుర్తి యాదవరావు (చరిత్రకారులు), చిన్ని కృష్ణుడు (ఆదర్శ రైతు), అమృతలత (ప్రముఖ రచయిత), నాలేశ్వరం శంకరం (కవి), వీ.పీ. చందన్ రావు (కవి, రచయిత), అష్ట గంగాధర్ (జానపద కళాకారులు), పాయల్ కోట్గిర్కర్ (ప్రముఖ తబలా వాయిద్య కారులు), పంచరెడ్డి లక్ష్మణ్ (ప్రముఖ కవి), గణపతి అశోక శర్మ ( అష్టావధాని), 

తల్లావజ్జల మహేష్ బాబు (ప్రముఖ కవి), కాసర్ల నరేష్ రావు ( కవి, రచయిత), ఘనపురం దేవేందర్ (కవి, వ్యాఖ్యాత), డాక్టర్ డి.శారద (ప్రముఖ విద్యావేత్త, రచయిత), గంట్యాల ప్రసాద్ (సాహితీవేత్త), తిరుమల శ్రీనివాస్ ఆర్య (ప్రముఖ కవి), కత్తి గంగాధర్ (సాంస్కృతిక విభాగం విలేఖరి), బోచ్కర్ ఓంప్రకాష్ (కవి, అష్టావధాని), ఆరుట్ల శ్రీదేవి (సాహితీ పరిశోధకులు), శ్రీమన్నారాయణ చారి (కవి, ప్రముఖ వ్యాఖ్యాత),  కళా లలిత (ప్రముఖ యాంకర్), బి.కళా గోపాల్ (కవి, రచయిత), మద్దుకూరి సాయిబాబు (సామాజిక సేవా కార్యకర్త, రచయిత), చింతల గంగాదాస్ (కవి, వ్యాఖ్యాత), చింతల శ్రీనివాస్ గుప్తా ( ప్రముఖ కవి), డాక్టర్ అన్నందాస్ జ్యోతి (విద్యావేత్త, రచయిత), కైరకొండ బాబు (ప్రముఖ చిత్రకారులు), సిర్ప లింగం (ప్రముఖ కళాకారులు), చిందు బాబయ్య (కళాకారులు), మహమ్మద్ రషీద్ (రేలా రే రేలా ఫేం కళాకారుడు), సాయి లవోల (జానపద కళాకారులు), జయలక్ష్మి (నాట్య గురువు), గంగాదేవి (జానపద గాయని), పసునూరి వినయ్ కుమార్ (కొరియోగ్రఫర్), టి. స్వప్నా రాణి (మ్యూజిషియన్), కే. సంతోష్ కుమార్ ( వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్), అష్ఫాక్ ఆస్పీ (ఉర్దూ కవి, వ్యాఖ్యాత), దారం గంగాధర్ (రచయిత) తదితర 40 మంది వివిధ రంగాల ప్రముఖులతో చర్చ గోష్టి జరిపిన అనంతరం గవర్నర్ వారితో పాటు, జిల్లా అధికారులతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >