| Daily భారత్
Logo




యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గ‌ర్ల్‌

News

Posted on 2025-07-14 13:26:30

Share: Share


యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గ‌ర్ల్‌

డైలీ భారత్, వరంగల్: రీల్స్‌ కలిపిన ప్రేమ పండంటి కాపురంలో చిచ్చు రేపింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. కేసు వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ ప్రత్యూష పని చేస్తోంది.. ఈ క్రమంలో హసన్‌పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో యువడాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ప్రత్యూష.. సృజన్‌ భార్యభర్తలు.. ఇద్దరు డాక్టర్లే.. నగరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సృజన్‌ కార్డియాలజీ డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో.. ఇద్దరు వైద్యుల సంసారంలోకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతి ఎంట్రీ అయింది.. ఆమెతో సృజన్‌ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసే ఓ అమ్మాయి డాక్టర్‌ సృజన్‌ను ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్‌గా చేసి ప్రమోట్‌ చేసింది. ఈ క్రమంలో సృజన్‌, ఆ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్‌లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్‌ను, యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

వైద్యురాలి మరణం వరంగల్ నగరంలో కలకలం రేపింది.. మంచి హోదాలో ఉండి కూడా వేరొక మహిళ మోజులో తన భార్యను దూరం పెట్టిన ఆ వైద్యుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >