| Daily భారత్
Logo




తమ పంట పొలంలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

News

Posted on 2025-07-14 12:59:02

Share: Share


తమ పంట పొలంలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

బాధితుడు మహిపాల్ రెడ్డి ఆవేదన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి యొక్క పంట భూమి జి.జి నడుకుడ గ్రామ శివారులోని తమ సాగు భూమి 1129 సర్వేనెంబర్ లో 5 ఎకరాల ఏడు గుంటల భూమి తన పేరుపై ఉందని అయితే తమ భూమి ఇరు ప్రక్కన ఉన్న 1128, 1130 సర్వే నెంబర్లలో ఉన్న మోతే రమణ, మోతే గంగారెడ్డి లకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు మరో సర్వే నంబర్ కు చెందిన బద్దం మల్లారెడ్డి, గంపల కళ్యాణ్ కుటుంబ సభ్యులు తన పంట భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గతంలో డొంకేశ్వర్ మండలం సర్వేయర్ అందరికీ మూడుసార్లు నోటీసులు ఇచ్చి సర్వేనెంబర్ 1128, 1129, 1130 సర్వే భూముల్లో హద్దులు పాటించి పంచనామ చేశారని తెలిపారు. అయితే గతంలో ఆర్మూర్ ఆర్డీవో సర్వే నెంబర్ 1129కి రక్షణ కల్పించాలని నందిపేట్ ఎస్ హెచ్ ఓ కి, డొంకేశ్వర్ ఎమ్మార్వో కి ఆదేశాలు సైతం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్డీవో ఆదేశాలు స్థానిక ఎమ్మార్వో ఆదేశాలు పోలీసులకు సైతం లెక్కచేయకుండా వారు తమపై అక్రమ కేసులు బనాయిస్తూ తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇప్పటికీ కూడా అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా తమ పక్కనున్న సర్వేనెంబర్ 1128, 1130 కి చెందిన వారు ట్రాక్టర్లతో తమ పంట పొలంలో దున్నుతూ తమను సాగు చేయకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు మైపాల్ రెడ్డి వేడుకున్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >