Posted on 2025-07-12 13:42:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో దాదాపు తమ తాత ముత్తాతల తరం నుండి ఏళ్ల తరబడిగా ఊర పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ కమిటీ సభ్యుడు రవి తెలిపారు. పూర్వం గత్తర్ (ప్లేగు వ్యాధి) రావడంతో చాలామంది చనిపోయారని చెప్పారు. దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నిష్ఠతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు. వ్యాధి తగ్గడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్లో ఈ నెల 13న ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ పండుగకు ఐదు రోజుల పాటు నిష్టతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుంచి మూడు తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఆయన చెప్పారు. మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >