Posted on 2025-07-11 19:19:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.విపత్కర సమయాలలో ప్రజలకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.వరదల నేపథ్యంలో పోలీసు శాఖ తరఫున ఐదు డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎ.ఎస్.పి విక్రమ్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏం శ్రీనివాస్, ఇ శ్రీనివాస్, సీఐ మడుపల్లి నాగరాజు, ఎస్సైలు గంజి స్వప్న, ట్రాఫిక్ ఎస్ఐ పండుగ తిరుపతి, అదనపు ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >