| Daily భారత్
Logo




రెండో టెస్ట్​లో ఇంగ్లండ్​పై భారత్​ ఘన విజయం

News

Posted on 2025-07-06 19:01:20

Share: Share


రెండో టెస్ట్​లో ఇంగ్లండ్​పై భారత్​ ఘన విజయం

రెండో టెస్ట్​లో యువభారత్​ ఘనవిజయం

336 పరుగుల భారీ తేడా

ఎడ్జ్​బాస్టన్​లో భారత్​కిదే తొలి గెలుపు

డైలీ భారత్, క్రికెట్ న్యూస్: భారత్​ ఎడ్జ్​బాస్టన్​ లో ఇప్పటివరకు 8 మ్యాచులాడగా, ఏడింటిలో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. ఇది తొమ్మిదో మ్యాచ్​. ఎట్టకేలకు 58 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలివిజయాన్ని నమోదు చేసి భారత్​ యువరక్తం చరిత్ర సృష్టించింది. ఆకాశ్​దీప్​ 10 వికెట్ల ప్రదర్శన చేసి, ఇంగ్లండ్​లో ఈ అరుదైన ఫీట్​ చేసిన రెండో బౌలర్​గా చరిత్ర లిఖించాడు. అంతకుముందు చేతన్​శర్మ 1986లో బర్మింగ్​హమ్​లో పది వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఇంగ్లండ్​కు అది ఎంత తెలివితక్కువ నిర్ణయమో తెలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్​ యువ సారథి శుభ్​మన్​ గిల్ డబుల్​ సెంచరీలో చెలరేగగా, జడేజా, యశస్వి సహకారంతో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాదీ సిరాజ్​ 6 వికెట్లతో రెచ్చిపోయాడు.  ప్రతిగా ఇంగ్లండ్​ తమ మొదటి ఇన్నింగ్స్​లో 407 పరుగులు చేసి భారత్​కు 180 పరుగుల ఆధిక్యతను అందించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్​ను కొనసాగించిన భారత్​ 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్​ చేసి  608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లండ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ఆఖరి రోజైన నేడు ఇంగ్లండ్​ 271 పరుగులకు ఆలౌట్​ అయి, 336 పరుగల భారీ తేడాతో అపజయం పాలైంది. భారత బౌలర్​ ఆకాశ్​దీప్​ ఈసారి 6 వికెట్ల బాధ్యత తను తీసుకున్నాడు.


#cricket

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >