| Daily భారత్
Logo




ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తని హత్య చేసిన భార్య

News

Posted on 2025-07-05 12:12:24

Share: Share


ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తని హత్య చేసిన భార్య

డైలీ భారత్, బాచుపల్లి: ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.

కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా(మండలం) కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప(32)కు ధన్వాడ మండలం రాంకిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని బాచుపల్లికి వచ్చారు. ఇక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో ఆగి ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టింది. దీంతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకుని ఉండగా.. గొంతు నులిమి హత్య చేసింది.

తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లింది. మృతదేహం గొంతుపై ఉన్న గాయాలు గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో గొంతుపై ఒత్తిడి వేయడం వల్ల అంజిలప్ప మరణించినట్లు తేలింది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారించారు. భర్తను తానే చంపినట్లు భార్య రాధ ఒప్పుకుంది. తన ప్రియుడితో మాట్లాడ వద్దని మందలించడం వల్లనే చంపానని చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >