| Daily భారత్
Logo




11 KG గణజాయి సీజ్ చేసి ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు

News

Posted on 2025-07-05 13:53:46

Share: Share


11 KG గణజాయి సీజ్ చేసి ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు

2.8 లక్షల విలువగల 11 KG గణజాయి సీజ్ చేసి ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు.

జిల్లా CCS, కోదాడ రూరల్ పోలీసు సంయుక్తంగా రైడ్.

గంజాయి సరఫరా, అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరము.

సమాచార వనరులు ఏర్పాటు చేసుకున సమర్ధవంతంగా పని చేస్తున్నాం.

ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి ని రూపుమాపడం కోసం కృషి చేస్తున్నాం.

కె. నరసింహ ఐ‌పి‌ఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వం నుండి సృష్టమైన ఆదేశాలు ఉన్నాయి మన సమాజం నుండి డ్రగ్స్ ను డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, దీనికోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది అన్నారు. గంజాయి రవాణా వినియోగము అమ్మకం లాంటి కేసుల్లో ఉన్న వారి అందరికీ కౌన్సిలింగ్ లు ఇస్తున్నాము. యువత దీని నుండి అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అలవాటు చేయాలని ప్రయత్నిస్తే అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి అని ఎస్పి కోరారు. గంజాయి సరఫరా, వినియోగం, రవాణా కు పాల్పడుతున్న వారి సమాచారం పోలీసు వారికి ఇవ్వాలి, ఇలాంటి వారిపై NDPS చట్టమ ప్రకారం కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి నిరంతర నిఘా ఉంచుతామ అని తెలిపినారు.

కేసు వివరాలు:

మొదటి నిందితుడైన అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలోనే తన స్నేహితుల ద్వారా గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. ఇంటర్ అనంతరం వారి ఆర్దిక పరిస్థితులు బాగోలేక చదువు మానివేసి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2023 వ సంవత్సరంలో కోదాడ రూరల్ పోలీస్ వారు ఇతని వద్ద గంజాయి పట్టుబడి చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించగా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు గంజాయి సేవించడం మానివేసినాడు. గత 10  రోజుల క్రితం కోదాడ రూరల్ PS గంజాయి కేసులో వాయిదాకు హాజరుకావడానికి సూర్యాపేట కోర్టుకు వెళ్లగా అక్కడ కోర్టు వాయిదా గురించి ఒడిస్సా రాష్ట్రం నుండి వచ్చిన ఒక వ్యక్తి పరిచయమైనాడు. అతను కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చినాడని తెలుసుకున్న తర్వాత ఆడప రాజేష్ తనకు గంజాయి తాగటానికి, అమ్మటానికి కావాలని ఆతనిని అడగగా అతను జూన్-29 ఆదివారం రోజు ఒడిస్సా రాష్ట్రంలో కలిమెళ్ళలో శివ మందిర్ గుడి వద్దకు రమ్మని చెప్పినాడు. అతను చెప్పినట్లుగా తేదీ 28.06.2025 రోజు రాజేష్ ఒడిస్సా రాష్ట్రం లో అతను  చెప్పిన అడ్రస్ కలిమెల శివ మందీర్ గుడి వద్దకు వెళ్ళి తేదీ. 29.06.2025 రోజు ఉదయం అతనిని కలిసి అతని వద్ద నుండి సుమారు 11 కేజి ల గంజాయి (6 ప్యాకెట్లు) ను రూ. 11000/- రూపాయలకు కొనుగోలు చేసుకొని అక్కడినుండి ఎవరికి దొరకాకుండా వచ్చేందుకు లారీలలో మరియు బస్ లో తన మార్చుకుంటూ తేదీ 30.06.2025 రోజు దొరకుంట గ్రామానికి వచ్చి గంజాయి తన ఇంట్లో పెడితే తన అమ్మ తిడుతుందని మరియు పోలీసు వారు పట్టుకుంటారు అని అట్టి గంజాయిని దొరకుంట గ్రామ శివారులో గల ఇండస్ట్రియల్ ఏరియా కి వెళ్ళు దారిలో ఐచర్ ట్రాక్టర్ షోరూం వెనుక ఖాళీ స్థలంలో చెట్ల పొదల మధ్య దాచిపెట్టి లో వద్ద తరచూ గంజాయి కొనుగోలు చేసే రెండవ నిందితుడైన వనపర్తి సాయి కుమార్ కు తేదీ. 02.07.2025 రోజు ఫోన్ చేసి  గంజా  తీసుకొని వచ్చిన విషయం చెప్పగా తేదీ. 04.07.2025 రోజు మధ్యాహ్నం సమయములో రెండవ నిందితుడైన వనపర్తి సాయి కుమార్ మొదటి నిందితుడి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేయడానికి రాగా వారిద్దరూ కలిసి గంజాయి  దాచిన చోటుకు వెళ్ళి ఆడప రాకేష్ అట్టి గంజాయిలోనుండి సుమారు (01) కేజీ గంజాయిని వనపర్తి సాయి కుమార్ కు ఇవ్వగా అదే సమయంలో పోలీసు వారు వారిద్దరినీ పట్టుబడి చేసి మొదటి నిందితుడైన ఆడప రాకేష్ వద్ద నుండి (05) ప్యాకెట్ల గంజాయి మొత్తం బరువు (09) కేజీల (900) గ్రాములు, ఒక సెల్ ఫోన్ మరియు రెండవ నిందితుడైన వనపర్తి సాయి కుమార్ వద్ద నుండి (925) గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ ను స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యడం జరిగింది. ఇట్టి గంజాయి విలువ సుమారుగా రూ 2.80 లక్షలు వరకు ఉంటుంది. పైన తెలిపిన నేరస్తులను కోర్టు నందు హాజరు పర్చడం జరుగుతుంది. 

నింధితులను అరెస్ట్ చేసిన తేదీ & స్థలము:

తేదీ: 04.07.2025,  మధ్యాహ్నం 01:00  గంటలకు, దొరకుంట గ్రామ శివారులో ఇండస్ట్రియల్ ఏరియా లో ఐచర్ ట్రక్ షోరూమ్ వెనుకాల గల ఖాలి స్థలము లో గల పొదల వద్ద.

 నిందితుల వివరములు:

1.అడప రాకేష్ వయస్సు 20  సం//లు, వృత్తి: డ్రైవర్, నివాసం: దోరకుంట గ్రామము, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. ఇతనిపై 2023 సం.లో కోదాడ రూరల్ PS నంధు గంజాయి కేసు నమోదైనది.

2.వనపర్తి సాయి @ సాయికుమార్  వ//21 సం//లు, వృత్తి: విద్యార్థి(ఇంటర్ పూర్తి అయినది), నివాసం: శ్రీరంగాపురం, కోదాడ టౌన్ సూర్యాపేట జిల్లా. (గతంలో కేసులు నిర్ధారణ కాలేదు)

స్వాధీనము:  2.8 లక్షల విలువగల 11 KG గణజాయి, 2 సెల్ ఫోన్స్ 

ఇట్టి స్పెషల్ టాస్క్ లో బాగా పని చేసిన CI  జి.రజితా రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్,కోదాడ రూరల్ ఎస్‌ఐ అనిల్ రెడ్డి, CCS ఎస్‌ఐ హరికృష్ణ, సి‌సి‌ఎస్ సిబ్బంది  శ్రీనివాస్, కరుణాకర్,  ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది జానీ, శ్రీనివాస్ లను, రూరల్ PS సిబ్భంది అయిన హెడ్ కానిస్టేబుల్ లింగరాజు, కానిస్టేబుల్ ప్రవీణ్ లను ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందించారు.

Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >