Posted on 2025-07-04 18:50:52
- NDPS చట్టం ప్రకారం కేసు నమోదు.
- డ్రగ్స్ రవాణా, వినియోగం, అమ్మకం నేరం.
- కఠిన శిక్షలు తప్పవు.
.. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
డైలీ భారత్, సూర్యపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వం నుండి సృష్టమైన ఆదేశాలు ఉన్నాయి మన సమాజం నుండి డ్రగ్స్ ను డ్రగ్స్ రైతు సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, దీనికోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది అన్నారు. గంజాయి రవాణా వినియోగము అమ్మకం లాంటి కేసుల్లో ఉన్న వారి అందరికీ కౌన్సిలింగ్ లు ఇస్తున్నాము. యువత దీని నుండి అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అలవాటు చేయాలని ప్రయత్నిస్తే అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి అని ఎస్పి కోరారు.
కేసు వివరాలు:
క్రైమ్ నం:222 /2025 U/S 8 (c) r/w 20 (b)(ii) (B), 29 NDPS Act-1985 సూర్యపేట టౌన్ పోలీసు స్టేషన్.
నిందితుల వివరాలు.
A-1: పిట్టల నాగరాజు వయసు: 28 సం,,రాలు, వృత్తి: ఫోటోగ్రాఫి:, నివాసము: ముత్యాలమ్మ టెంపల్ ఏరియా సూర్యపేట్ టౌన్
A-2: ఆది వంశీ @ చొర్ వంశీ @ నిశాల్ వయసు: 21 సం,,రాలు, DJ Worker, నివాసము: చంద్రన్నకుంట, సూర్యపేట్ టౌన్(Absconding)
A-3: విశ్వనాధుల సై కుమార్ వయసు;19 సం,,రాలు, R/o ఇందిరమ్మ హాస్పిటల్ ఏరియా సూర్యపేట్ టౌన్. (Absconding)
A-4: దోసపాటి వంశీ @ లక్ష్మినారాయణ వృత్తి: ఆటొ డ్రైవరు, నివాసము మోతే, సూర్యపేట (Absconding)
A-5) సరగండ్ల శివ కార్తిక్ @ రాజు , వయసు : 22 సం,,రాలు, , కులము; ముదిరాజు , R/o Near కృష్ణా టాకీస్ ఏరియా సూర్యపేట్ టౌన్ (Absconding)
A-6: అంగోతు వంశీ వయసు: 20 సం,,రాలు, వృత్తి: హోటల్ వర్కర్, నివాసము: సుంధరయ్య నగర్, సూర్యపేట.
A-7: రెడ్డి పల్లి మధుసూదన్ వయసు: 21 సం,,రాలు, , వృత్తి: స్టూడెంట్, నివాసము: దాసాయిగూడెం, సూర్యపేట.
A-8: కూతురు ఆకాశ్ , వయసు: 22 సం,,రాలు, , వృత్తి: స్టూడెంట్, నివాసము: రాజీవ్ నగర్, బార్లపెంట బజార్, సూర్యపేట
A-9: శూర శ్రవణ్ కుమార్ వయసు: 25 సం,,రాలు, , వృత్తి: కూలీ, నివాసము: శాంతి నగర్, విజయ కాలనీ, సూర్యపేట
A-10: గుండారపు శివ , వయసు: 34 సం,,రాలు, వృత్తి: డ్రైవరు, నివాసము: హనుమాన్ నగర్, సూర్యపేట
వీరి వద్ద నుండి సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువ గల 11.780 kg ల గంజాయి, 6- సెల్ ఫోన్ లుమరియు 1 -స్కూటి స్వాధీనం
తేదీ: 03.07.2025 రోజు న సాయంత్రము 04:30 గం. లకు , సూర్యపేట పట్టణములోని నల్లచెరు గుట్ట పై ఆరుగురు వ్యక్తులు గంజాయి తో ఉన్నారు అని నమ్మదగిన సమాచారం మేరకు, జిల్లా CCS పోలీసు మరియు సూర్యపేట పట్టణ సిఐ వెంకటయ్య బృందం యస్.ఐ ఎం. ఏడుకొండలు వారి సిబ్బంది తో యుక్తముగా నల్లచెరు గుట్ట వద్దకు వెళ్ళగా అక్కడ (6) మంది వ్యక్తులు ఒక స్కూటి తో నల్లచెరు గుట్ట వద్ద గంజాయి కూర్చొని ఉండగా, యస్. ఐ తన సిబ్బందితో యుక్తంగా పట్టుబడి చేసి, విచారణ చేయగా! వారు తమ పేర్లు 1. పిట్టల నాగరాజు 2. అంగోతు వంశీ, 3. రెడ్డి పల్లి మధుసూదన్, 4. కూతురు ఆకాశ్,5. శూర శ్రవణ్ కుమార్ మరియు 6. గుండారపు శివ, అని తెలిపి, ఇందులో పిట్టల నాగరాజు, అది వంశీ లు ఆంధ్రప్రదేష్ రాష్ట్రములోని విశాఖపట్నము దగ్గరగల అరకు ప్రాంతములో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని తీసుకొని వచ్చి అట్టి గంజాయిని చిన్న చిన్నపొట్లాలు చేసి ఐదు నుండి పది గ్రాముల ఒకొక్క పొట్లంమును 500 రూపాయలకు అమ్మి డబ్బులు సంపాదిస్తునారు. వీరితో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారు వారిని పట్టుకోవడానికి పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. నిందితులు అందరూ ఒకొక్కలు 3000/- రూపాయలు వేసుకొని 30,000/- రూపాయలతో తేదీ: 30-06-2025 రోజు నాగరాజు, ఆది వంశీ, సూర్యపేట నుండి బస్ లో ఖమ్మంకు వెళ్ళి ఖమ్మం నుండి రైలులో ఆంధ్రప్రదేష్ రాష్ట్రములోని విశాఖపట్నము వెళ్ళి విశాఖపట్నము దగ్గర గల అరకు ప్రాంతము వెళ్ళి 12 కేజీల గంజాయిని ఒక్క కేజీ 2000/- రూపాయల చొప్పున కొనుక్కొని, 12 కేజీల గంజాయిని 24,000/- రూపాయల గుర్తుతెలియని వారి వద్ధ కొని తీసుకొని తేదీ 03.07.2025 రోజు ఉదయం సమయమున సూర్యాపేటకు వచ్చి అట్టి గంజాయిని సూర్యాపేట పట్టణములో నాగరాజు ఇంటిలో ఏవరికి కనిపించకుంట దాఛీపెట్టి. అట్టి గంజాయిని అంధరికీ పంచుటకు నల్లచెరువు గుట్ట వద్దకు రమ్మనగ అంధరు తేదీ:- 03.07.2025 సాయంత్రము 04:30 గంటల సమయములో నాగరాజు నల్లచెర్వు గుట్ట వద్దకు అరకు నుండి తీసుకు వచ్చిన గంజాయిని తీసుకొని వచ్చుటకు ముందుగానే అంగోతు వంశీ వద్ధ అతని TVS Ntorq Scooty తీసుకొని అట్టి గంజాయిని బైక్ పై నాగరాజు ఇంటిలో నుండి తీసుకొని నల్లచెర్వు గుట్ట వద్దకు రాగా, ఆది వంశీ తనకు పని ఉంది అని అతని యొక్క బాగమును నాగరాజు తీసుకోనినాడు, విశ్వనాదుల సాయి కుమార్ తనకు పని ఉంది అని అతని యొక్క బాగమును అంగోతు వంశి తీసుకోనినాడు, దోసపాటి వంశీ తనకు పని ఉంది అని అతని యొక్క బాగమును రెడ్డిపల్లి మధుసూదన్ ను తీసుకోమనినాడు, సరగండ్ల శివ కార్తీక్ తనకు పని ఉంది అని అతని యొక్క బాగమును కూతురు ఆకాశ్ తీసుకోనినాడు. అంధరు నల్లచెర్వు గుట్ట పై కలిసి అట్టి గంజాయిని పంచుకోనుటకు బ్యాగ్ లో నుండి గంజాయిని తీసి బయట పెట్టగా అదే సమయములో పోలీసువారు ఇట్టి స్థలమున వద్ధకు వెళ్ళి గంజాయి తో పాటు మా ఆరుగురుని పాటుబడి చేసినారు.
ఈ సమావేశం నందు ఎస్పీ వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, SI లు ఏడుకొండలు, మహేంద్ర నాథ్, హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
ఇట్టి గంజాయి సీజ్ చేయడంలో నిందితులను అరెస్ట్ చేయడంతో భాగా పని చేసిన CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్‌ఐ హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లు శ్రీనివాస్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రమేశ్, సూర్యపేట పట్టణ సిఐ ఎ. వెంకటయ్య SI లు ఎం. ఏడుకొండలు, ఐ. మహేంద్రనాథ్, వారి సిబ్బంది, నవీన్, రవి కిరణ్, రవి, ఈశ్వర్ సింగ్ , సురేష్, రైటర్ వీరయ్య, లక్ష్మినారాయణ, బజార్ లను ఎస్పీ అభినందించారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >