Posted on 2025-06-23 16:19:48
కొత్తగూడెం కార్పొరేషన్ లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి
దోమల నివారణకు చర్యలు చేపట్టి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలి: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
డైలీ భారత్, కొత్తగూడెం:భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచన మేరకు సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన ధర్నాలో సీతాలక్ష్మీ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు. వెంటనే దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయించాలని సూచించారు. కొత్తగూడెంలో అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు. అన్ని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కోసం ఎక్కడికక్కడ పైప్ లైన్ ల కోసం తవ్విన గుంటలను పూడ్చి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. తవ్విన గుంటల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని విమర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు.
ఈ నిరసన ధర్నాలో మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, పల్లపు రాజు, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, మునీర్, హుస్సేన్, ఎస్సీ సెల్ రామిళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, అజ్మీరా విజయ్, రాజ మల్లయ్య, షమ్మీ, మొయినుద్దీన్, సూరి, అశోక్, నగేష్, బాబు జానీ, నాగ రాజు, మజీద్, అన్వర్ ఖాజా, తుంగ కనకయ్య, ఆర్ శ్రీనివాస్,వెంకట రమణ,రమేష్ శ్రీదేవి, శైలజ, కోమల, శ్రీనిజ, సుందర్ పాసి, టింకు, సోనీ పాసి, సౌజన్య, ఆశ, మాధవి, స్వర్ణ, లక్ష్మి, కమల, విజయ, జి విజయ, సుహాని, మహేశ్వరి, రమణ, శ్రావణ్, నసీమా, మహబూబ్, షేక్ బాజీ, షేక్ బిబి, సత్యవతి, ఖంరుణ్నిసా, షణ్ముఖ, సిద్దు, బన్ను, అమన్, తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >