Posted on 2025-06-19 10:39:52
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
డైలీ భారత్, హైదరాబాద్: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ రెడ్డి (28) అనే యువకుడు మణికొండలోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్నాడు. అయితే సురేష్ గత రెండు రోజుల క్రితం అక్క ఇంటికి వెళ్తున్నానని చెప్పి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీకి వచ్చాడు. 2 రోజుల కోసం ఒక సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సమయంలో సురేష్ తనతో పాటు హీలియం సిలిండర్ కూడా తెచ్చుకున్నాడు.
మొదటి రోజు కాకుండా మరుసటి రోజు తన డైరీలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. అనంతరం తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని, హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్ లోకి వెళ్లి రెండు రోజులైనా కూడా సురేష్ బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చి అపార్ట్మెంట్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సురేష్ బెడ్ మీద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#crime #crime news
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >