Posted on 2025-06-18 09:32:28
మంజూరు చేయిస్తామంటూ నాయకుల వసూళ్లు
త్వరలోనే జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయం ముట్టడి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని *వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లకావత్ గిరిబాబు* అన్నారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని వారికి, కిరాయి గృహాల్లో ఉన్న వారికి కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులను పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకి మండలంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా గ్రూపులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే పోస్టులు పెడుతున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తక్షణమే స్పందించి మండలంలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు & రాజీవ్ యువ వికాస్ మంజూరు చేయాలని, వీటి ఎంపికలో అధికారులను బలి పశువులను చేయకుండా పూర్తి పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ చేశారు. మొదటి విడతలో ఎంపికైన జూలూరుపాడు పలు గ్రామపంచాయతీలో ఏఈ సమక్షంలో ముగ్గు పోసిన ఇంటికి బిల్లు రాకుండా అడ్డుకుంటున్నారని, 400 చదరపు అడుగుల నుండి 600 వరకు ఉండాలనే నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >