| Daily భారత్
Logo




అల్లాహ్ పేరుతో ఆత్మహుతి..

News

Posted on 2025-06-08 09:04:46

Share: Share


అల్లాహ్ పేరుతో ఆత్మహుతి..

బక్రీద్ రోజు మేకకు బదులు తానే గొంతుకోసుకుని.

డైలీ భారత్, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఎవరూ హత్య చేయలేదని రాశాడు. ఆ సూసైడ్ నోట్ లో ఇలా రాసి ఉంది. “ఒక మనిషి తన సొంత బిడ్డలాగా మేకను పెంచి, దానిని బలి ఇస్తాడు. అది కూడా జీవమే. మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. అల్లాహ్ దూత పేరిట నన్ను నేను అర్పించుకుంటున్నాను.” అని పేర్కొన్నాడు. తన సమాధిని ఎలా రూపొందించాలో కూడా నోట్ ద్వారా వివరించాడు.

మరోవైపు.. మృతుడి భార్య హజ్రా ఖాటూన్ తన భర్తకు దయ్యాలు పట్టాయని, అతను తరచుగా అజంగఢ్ దర్గాను సందర్శించేవాడని చెప్పింది. మూడు రోజుల క్రితం దర్గా నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపింది. శనివారం.. అతను తన ఇంట్లో ధూపం వెలిగించి తంత్ర మంత్రం చేశాడని.. అకస్మాత్తుగా రక్తంతో తడిసి చనిపోయాడని పేర్కొంది. సమీపంలో ఒక భుజలి (పదునైన ఆయుధం) పడి ఉందని చెప్పింది. ఆమె వెంటనే, డయల్ 112 కు సమాచారం అందించింది. పోలీసులు గాయపడిన వారిని డియోరియా మెడికల్ కాలేజీకి, ఆపై గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. “అన్సారీ స్వయంగా గాయపరిచాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మేము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం.” అని అన్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >