| Daily భారత్
Logo




ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య...

News

Posted on 2025-06-08 08:44:39

Share: Share


ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య...

బడి మనది... బడిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే ...

ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల,సిరిసిల్ల ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరానగర్ ,బివైనగర్లలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, చైతన్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ వేముల మార్కండేయులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో  నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు టీచర్లుగా పనిచేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక అవార్డులు అందుకున్నారని, గత రెండేళ్లుగా పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, బాసర త్రిబుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కుమ్మరి మల్లేశం సమ్మయ్య సామాజిక కార్యకర్తలు రామకృష్ణ నవీన్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >