| Daily భారత్
Logo




ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం

News

Posted on 2025-06-07 15:16:30

Share: Share


ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం

డైలీ భారత్, రాజస్థాన్:రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు కొంత స్పృహ ఉండ‌టంతో కుటుంబ స‌భ్యుల‌ను పిలిచేందుకు ప్ర‌య‌త్నించింది.


ఆ త‌ర‌వాత పూర్తిగా మ‌త్తులోకి జారుకోగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. స్పృహ వ‌చ్చిన త‌ర‌వాత బాధితులు విష‌యాన్ని కుటుంబ స‌భ్య‌లుకు తెలిపింది. దీంతో ఆమె భ‌ర్త ఆస్ప‌త్రి యాజ‌మాన్యాన్ని నిల‌దీశాడు. కానీ యాజ‌మాన్యం ఖండించ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు. సీసీ టీవీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌పై క‌మిటీ వేసి విచారిస్తామ‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న‌తో ఆస్ప‌త్రిలోని ఇత‌ర పేషంట్స్ కూడా భ‌య‌పోడిపోతున్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >