Posted on 2025-06-04 16:10:52
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బుధవారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...
బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల (జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్) వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు.చెక్పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >