| Daily భారత్
Logo




రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-06-02 04:38:51

Share: Share


రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాలి :  బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాల‌ని పార్టీ శ్రేణులకు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏండ్ల అలుపెరగని పోరాటంతో, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని ఎగురవేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాల‌న్నారు. పార్టీ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరపాల‌ని తెలిపారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని ఆయన ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సర్కార్‌కు దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >