| Daily భారత్
Logo




పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-05-28 14:23:29

Share: Share


పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం షాబాద్ మండలం అంతారం, సంకేపల్లి గూడా, నాగర్ కుంట,షాబాద్, హైతాబాద్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు  చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ సర్టిఫికెట్ అందించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ , సర్దార్నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి , మాజీ ఎం.పీ.టీ.సీ కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, తమ్మలి రవీందర్, ఖజామియా పటేల్, నరేందర్ రెడ్డి, మహేందర్ గౌడ్, జంగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దండు రాహుల్ గుప్త, గంధం గౌరీశ్వర్,అక్తర్ పాషా, పైల్వన్, వెంకటయ్య,లింగం, సంజీవ రెడ్డి,అధికారులు, నాయకులు, పాల్గొన్నారు

Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >