డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆశన్నగారి మధుకర్ రెడ్డి అన్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి, 4కె జిమ్ ఆశన్నగారి మధుకర్ రెడ్డి,యువ సత్త లక్ష్మన్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని షాద్ నగర్ పరిగి రోడ్డులోని 4కె జిమ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువత, ఫిట్నెస్ ప్రియులు, సామాజిక కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ద్వారా మనం ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కనై ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని కోరారు.ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన యూనిట్లు తలసీమియా, రోడ్డు ప్రమాద బాధితులు, అత్యవసర శస్త్రచికిత్సలలో ఉన్న రోగులకు అందించనున్నారు.ఈ కార్యక్రమంలో రఘువీరా రెడ్డి ముక్తేశ్వర్,వంశీ గౌడ్,వేణు గోపాల్, కోట భరత్, హజిపల్లి నవీన్, కుర్వగడ్డ భాను, మదుసుదన్ రేడ్డి, ఉదయ్, గని పికెపి,సాయి,అజ్మీర్,రఫీక్, సాత్విక్, సురేష్, చరణ్,కృష్ణ, మోహన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
News
రక్తదానం ప్రాణదానంతో సమానం : ఆశన్నగారి మధుకర్ రెడ్డి