Posted on 2025-05-25 10:29:28
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
డైలీ భారత్, హైదరాబాద్: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >