Posted on 2025-05-23 19:18:40
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు దమ్మపేట మండలం మారుమూల గిరిజన ప్రాంతం పామాయిల్ గిరిజన రైతు తోటలు జగ్గారం. గండుగులపల్లి గ్రామాలలో సన్నా చిన్న కారు రైతు తోటలు పరిశీలించి ఆఫ్ టైప్ మొక్కలను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో వారి తోటలు చూసి కొన్ని చెట్లు తొలగించిన వాటిని కూడా పరిశీలించడం జరిగింది..
ప్రభాకర్ రెడ్డి పామాయిల్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..
1.పామాయిల్ తోటలు వేసుకుని అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరులను ప్రోత్సహిస్తూనే మరొక్క కుంభకోణం కొంతమంది అధికారులు చేస్తుంటే రక్షించ వలసిన వాళ్ళు కాపాడ వలసిన వాళ్లు ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్రమాలు అరికట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యక్తపరిచారు. 2016 నుండి 2022 వరకు ఓ ప్రభుత్వ ఉద్యోగి నాసిరకం మొక్కలు నర్సరీలో కలిపి రైతు తోటలకి సప్లై చేసినారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటే కనీసం రైతు బాధ తెలుసుకోవటానికి స్థానిక ఎమ్మెల్యేకూడా మా బాధలు తెలుసుకోవడానికి ఖాళీ లేనట్లు వ్యవహరిస్తున్నారని వ్యక్తపరుస్తున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించండి. విత్తన చట్టంలో ఆయిల్ ఫామ్ ని చేర్చండి. అక్రమాలను వెలుగు తీయండి. మీరు చేయకపోతే మా బిజెపి పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచి తగు న్యాయం చేయుటకు రైతు పక్షాన మేము ఉంటామని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.
గిరిజన నాయకుడు కారం శ్రీరాములు మాట్లాడుతూ..
మా గిరిజన హరిజన సన్న చిన్న పామాయిల్ రైతు సోదరులు విజ్ఞప్తి మేరకే ఈ ఆప్ టైప్ పామాయిల్ మొక్కల సమస్య ప్రభుత్వ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి సంబంధించిన అందరికీ తెలియపరుస్తారని ఉద్దేశంతో ఈరోజు ఈ సమస్య ఈ జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి వివరించటం జరిగింది మా యొక్క సమస్యని తెలుసుకొని మా గిరిజన తోటలు నష్టపోయిన రైతు సోదరుల తోటలను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు న్యాయం చేస్తారని న్యాయం చేయాలని ఈ సమస్య పరిష్కారం కోసం రైతు సోదరులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారిని గిరిజన నాయకుడిగా కోరనైనది.
ఈ కార్యక్రమంలో.. రైతులు రైతు సంఘ నాయకులు తుంబూరు మహేష్ రెడ్డి చెలికాని సూరిబాబు వెంకట్రావు కొరస. వీరస్వామి. కురుస ముత్యాలు కొమరం భీముడు వెంకటరావు వసంతరావు వీరస్వామి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >