| Daily భారత్
Logo




ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్

News

Posted on 2025-05-18 00:48:57

Share: Share


ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారీ తో కలిసి మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో  సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన (14) పరీక్ష కేంద్రాల్లో (2539) మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, (1594) రెండవ సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం (4133) మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు.

ఈ మేరకు (14) మంది చీఫ్ సూపరింటెండెంట్లు, (14) మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, (01) అదనపు చీఫ్ సూపరింటెండెంటు, (01) కస్టోడియన్,(1) ఫ్లయింగ్ స్క్వాడ్‌, (1) ను నియమించామన్నారు.

నిర్దేశించిన  మార్గాల ద్వారా ప్రశ్నపత్రాలను ఆయా పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత నడుమ చేరవేయాలన్నారు.

ఆయా పరీక్షా కేంద్రాల్లో నిఘా నేత్రాలను (సీసీ కెమెరాలు) సరిచూసుకోవాలన్నారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది సరిపడా ఔషధ నిల్వలతో కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.

ఈ సమన్వయ సమావేశంలో డీ.ఐ.ఈ.ఓ మాధార్, ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ నరేష్, డి.ఎం.హెచ్. ఓ రవి రాథోడ్,  మహబూబాబాద్ టౌన్ సి.ఐ పి.సర్వయ్య, జి.సి.జి.డి.ఓ శ్రీరాములు, తొర్రూరు మునిసిపల్ కమిషనర్ శాంతి కుమార్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, పోస్టల్ అధికారి గోపీకృష్ణ, ఆర్టీసీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >