Posted on 2025-05-17 09:25:54
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో సంస్థ రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ మెట్రో నిర్ణయం తీసకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 12కు పెంచారు. ఇక గరిష్ఠ ఛార్జీ రూ. 60 ఉండగా.. దాన్ని రూ. 75కు పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలు స్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిం దని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు.
దానికి తోడుగా..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 - రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగిం చడానికి, మౌలిక సదు పాయాలను మెరుగు పరచడానికి సహాయప డుతుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతుండగా.. మెట్రో ఛార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది.
కాగా, మెట్రో రైల్వేస్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం, చార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >