| Daily భారత్
Logo




వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

News

Posted on 2025-05-04 17:49:37

Share: Share


వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

వికలాంగుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

మే 13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి

NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

డైలీ భారత్ న్యూస్ : వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని,ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10లోపు మార్చాలని, వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మే 13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులున్నారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది ఉంటే 4,90,044 మందికే పెన్షన్స్ వస్తున్నావి. 2016 ఆర్ పి డబుల్ డి(R PWD) చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. మహిళా వికలాంగులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వికలాంగులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నవి. వైకాల్యం కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్య సంస్థలు లేకపోవడం వలన ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న టీసీపీసీ కేంద్రాలను బలోపేతం చేస్తూ, ఉమ్మడి జిల్లాలో టీసీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్స్ లలో రిజర్వేషన్స్ అమలు కావడం లేదు.వికలాంగుల వివాహ ప్రోత్సాహం 2 లక్షలకు పెంచడంతో పాటు జంటలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం,ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే 5 లక్షల ప్రోత్సాహం, ఇవ్వాలని డిమాండ్ చేశారు. 40శాతం వైకాల్యం ఉన్న ప్రతి ఒక్కరికి పరికరాలు ఇవ్వడంతో పాటు చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి మోటారైస్డ్ వాహనాలు ఇవ్వాలి.RTC లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి, 2016 RPD చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో భవిత సెంటర్స్ ఏర్పాటు చేసి, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న NHC కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలావెన్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలి.ప్రతి వికలాంగునికి సామజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ, ప్రయివేట్ విద్య సంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. వికలాంగుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కారం కోసం మే 13న డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హేచ్చరించారు

Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >