Posted on 2025-05-04 14:21:13
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు బోజ్జయ్య
పటాన్చెరు, డైలీ భారత్ న్యూస్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన.. పటాన్చెరు పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణంలో మెజార్టీ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు సొంత నిధులను సైతం అందించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులను వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కులం అంటేనే బలమని.. వారి వారి కులాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్ల పెళ్లిళ్లకు.. మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కులంలోనూ వర్గాలు సహజమని.. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, ఆదర్శ్ రెడ్డి, నర్రా బిక్షపతి, సంఘం నూతన అధ్యక్షులు బోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >